Union governament favour to Delimitation of Assembly seats in AP and Telangana .For political gain Bjp favour to delimitaton of Assembly seats in AP and Telangana states.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై బీజేపీ సానుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయమై మరోసారి కదలిక వచ్చినట్టు సమాచారం. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులతో బాబు చర్చించారని సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు బిజెపి మొగ్గు చూపడం ఆ పార్టీ వైఖరిలో మార్పుకు సంకేతమనే అభిప్రాయాన్ని రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన విషయమై కొంత కాలంగా చర్చ సాగుతోంది. అయితే తొలుత ఈ విషయమై సానుకూలంగా బిజెపి ఉన్నట్టు కన్పించింది. అయితే ఆరు మాసాల క్రితం నియోజకవర్గాల పెంపు కారణంగా రాజకీయంగా తమకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదని బిజెపి భావించింది. ఈ కారణంగా నియోజకవర్గాల పెంపు పట్ల బిజెపి కొంత అయిష్టతతో ఉందనే ప్రచారం సాగింది.